Modi: 5న ఆప్ పోతుంది.. బీజేపీ వస్తుంది : ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ (Delhi)లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఘోండా నియోజకవర్గం లో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP)దే విజయమని తెలిపారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఆప్ సర్కారు(AAP government) పోయి, బీజేపీ సర్కారు వస్తుందని జోస్యం చెప్పారు. ఈ మాట తాను మాత్రమే చెప్పడం లేదని యావత్ ఢిల్లీ ప్రజలంతా ఇదే అంటున్నారని అన్నారు.
ఢిల్లీ ప్రజలు ఇంటింటికి నల్లా నీళ్లు కావాలని, ట్యాంకర్ మాఫీయా నుంచి విముక్తి కల్పించాలని కోరుకుంటున్నారని ప్రధాని చెప్పారు. గత 11 ఏళ్లుగా అధికారంలోకి ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ వారి ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఆప్ అబద్ధపు హామీలను ఇప్పుడు ఢిల్లీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వారంతా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ సభకు హాజరైన జన సంఖ్యే చెబుతోందని అన్నారు. ఢిల్లీ బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టో (Manifest)ను ప్రధాని మెచ్చుకున్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించేలా మ్యానిఫెస్టో ఉన్నదని అన్నారు.