Modi: ఢిల్లీ ఓటర్లకు సెల్యూట్.. ప్రధాని మోదీ

27 ఏళ్ల పాటు కాంగ్రెస్ (Congress), ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party )పాలన చూసి ఢిల్లీ ఓటర్లు ఈసారి బీజేపీ (BJP )కి అవకాశం ఇచ్చారు. కమలం పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టారు. అందుకుగానూ ప్రధాని మోదీ (Modi) వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ఓటర్లకు సెల్యూట్ అంటూ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన సోదరసోదరీమణులకు అభినందనలు (Congratulations) తెలియజేశారు. ఇక అభివృద్ధి తమ గ్యారంటీ అన్నారు.
అభివృద్ధి సుపరిపాలన విజయం సాధించాయి. ఈ భారీ విజయం కోసం నిర్విరామంగా పనిచేసిన కార్యకర్తల పట్ల గర్వంగా ఉంది. ఢిల్లీ అభివృద్ధికి, ప్రజల జీవితాలు మెగురుపరచడానికి అహర్నిశలు శ్రమిస్తామని హామీ ఇస్తున్నాం. అలాగే భారత్ అభివృద్ధిలో ఢిల్లీ ముఖ్యపాత్ర పోషించనుంది. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి అంకితభావంతో ముందుకు వెళతాం అని మోదీ పేర్కొన్నారు.