Somnath Temple: సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో గల ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ దేవాలయాన్ని (Somnath Temple) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దర్శించున్నారు. ఈ సందర్భంగా సోమనాథ లింగాని (Somnatha Linga )కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోరుగున గల జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయారణ్య ప్రధాన కేంద్రం సాసన్ (Sasson)కు వెళ్లారు. ఈ ప్రాంతం ఆసియా సింహాలకు నెలవై ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం నేపథ్యంలో సాసన్‌లో జరిగే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అలాగే సింహాల సందర్శనకు వెళ్తారు. సోమనాథ్ పర్యటనకు ముందు మోదీ జామ్‌నగర్ (Jamnagar) జిల్లాలోని జంతు రక్షణ, సంరక్షణ, పునరావాస కేంద్రం వన్‌తారాను సందర్శించారు.