5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజే 5జీ సేవల్ని ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ప్రధాని ఈ సేవలను ప్రారంభించారు. ఆరవ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది వచ్చే దీపావళి పండుగ నుంచి యూజర్లు 5జీ సేవలను ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఎయిర్టెల్, రిలయన్స్ జియో, క్వాల్కమ్ కంపెనీలు తమ 5జీ సేవల గురించి ప్రధాని మోదీకి వివరించాయి. ఆకాశ్ అంబానీ 5జీ గురించి ప్రధానికి డెమో ఇచ్చారు.
ప్రధాని మోదీ 5జీ సేవల్ని ప్రారంభించడం చరిత్రాత్మకమని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. టెలికాం చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించబదుతుంది అని చెప్పారు. డిజిటల్ ఇండియాకు ఇది పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ డిజిటల్ సేవల్ని చేరవేయడంలో 5జీ చాలా ఉపయోగపడుతుంది అని మంత్రి వైష్ణవ్ తెలిపారు.






