ఆయనలా ఎవరూ ప్రవర్తించకండి.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన

కాంగ్రెస్సేతర నేత వరుసగా మూడోసారి ప్రధాని కావడాన్ని హస్తం పార్టీ జీర్ణించుకోలేకపోతోందని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్ గాంధీ సభలో అవమానకర ప్రసంగం చేశారని దుయ్యబట్టారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించొద్దని, ఎన్డీయే ఎంపీలంతా పార్లీమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని ప్రధాని సూచించారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికార పక్ష ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సమావేశంలో మోదీ ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు.