ఫోన్ పే మరో రికార్డు
ఆర్థిక సేవల సంస్థ ఫోన్‌పే మరో రికార్డును సాధించింది. 50 కోట్ల మంది కస్టమర్లు ఫోన్‌పే సేవలను వినియోగించుకుంటున్నారు. అంతర్జాతీయంగా 50 కోట్ల మంది యూజర్లు కలిగిన తొలి భారతీయ సంస్థ ఫోన్‌పే కావడం విశేషం. ఈ సందర్భంగా ఫోన్‌పే ఫౌండర్, సీఈవో సమీర్ నిగమ్ మాట్లాడుతూ స్వల్ప కాలంలోనే 50 కోట్ల మైలురాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని, సంస్థ పెట్టుకున్న 100 కోట్ల భారతీయుల్లో సగానికి చేరుకున్నట్టు తెలిపారు. జనవరి 2022 నాటికి 35 కోట్ల యూజర్లకు చేరుకున్న సంస్థ ఆ మరుసటి ఏడాదిన్నరలోగా మరో 15 కోట్ల కస్టమర్లను ఆకట్టుకోవడం విశేషమన్నారు. ప్రతి ముగ్గురి భారతీయుల్లో ఒక్కరు ఫోన్‌పేను వినియోగిస్తున్నారు. కేవలం ఏడేండ్లలో ఈ మైలురాయికి చేరుకున్నది. ఆగస్టు 2016 లో ఫోన్‌పే ఆర్థిక సేవలు ఆరంభించిన విశేషం తెలిసిందే.






