పోస్టాఫీసులో పాస్‌పోర్టు స్లాట్ల పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ( పీఓపీఎస్‌కే) స్లాట్‌లు పెంచేందుకు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి అంగీకరించినట్లు రాష్ట్ర చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పాస్‌పోర్టులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో స్లాట్ల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు వీలుగా వాటిని పెంచాలని కోరినట్లు వెల్లడిరచింది. చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయంలో జరిగిన సమన్వయ సమావేశంలో చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ పి.వి.ఎస్.రెడ్డి, హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి జొన్నల గడ్డ స్నేహజ, యూఐడీఏఐ డైరెక్టర్ ఆర్.వి.ఎం.శ్రీనివాస్, పోస్టల్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.