Indrani Mukherjee :సుప్రీంకోర్టులో ఇంద్రాణి ముఖర్జికి చుక్కెదురు

షీనా బోరా (Sheena Bora) హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ (Indrani Mukherjee ) విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. విదేశాలకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదని పేర్కొంది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court) గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం, ఈ కేసు విచారణను ఏడాది లోపల పూర్తి చేయాలని ట్రయల్ కోర్టు (Trial court )ను ఆదేశించింది. మళ్లీ తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. విచారణ తుది దశకు చేరుకుంది. విచారణ కొనసాగుతున్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ దశలో మీ విజ్ఞప్తిని అనుమతించలేం. విచారణ వేగవంతం చేసి ఏడాదిలోగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తున్నాం అని సుప్రీం ధర్మాసనం వెల్లడిరచింది.