Nirmala Sitharaman: ఆ విషయం చర్చించేందుకే గోయల్ అమెరికా పర్యటన: నిర్మలా సీతారామన్

కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. అమెరికా ఎందుకు వెళ్లారో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు. భారత్‌పై అమెరికా విధిస్తున్న సుంకాల గురించి చర్చించడం కోసమే గోయల్ అమెరికా వెళ్లారని ఆమె వివరించారు. అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖతో ఆయన చర్చలు జరుపుతున్నారని, భారత్ నుంచి వెళ్లే ఎగుమతులను దృష్టిలో పెట్టుకొనే ఈ చర్చలు సాగుతున్నాయని నిర్మల (Nirmala Sitharaman) తెలియజేశారు.
అలాగే బడ్జెట్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పుల గురించి కూడా ఆమె మాట్లాడారు. వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్లు, న్యాయవాదులు, వివిధ సంఘాల నుండి సలహాలు, సూచనలను తీసుకొని ఈ మార్పులు చేస్తామని ఆమె (Nirmala Sitharaman) తెలిపారు. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఏమైనా మార్పులు చేసేందుకు గడువు ఉంటుందని చెప్పిన ఆమె.. పార్లమెంటు తిరిగి ప్రారంభమైన తర్వాత ఫైనాన్స్ బిల్లుపై చర్చ జరుగుతుందని గుర్తుచేశారు. ఆ తర్వాతే బడ్జెట్‌ను ఆమోదస్తామని, ఈలోపు ఇతరుల అభిప్రాయాలు, సూచనలు వస్తే సవరణలు చేస్తామని నిర్మల (Nirmala Sitharaman) స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం ఎక్కువగా రోడ్లు, ఆసుపత్రులు, విమానాశ్రయాలపై ఫోకస్ పెట్టిందని, అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తున్నామని నిర్మల (Nirmala Sitharaman) పేర్కొన్నారు. ప్రజలు ఉపయోగించుకున్న వస్తువులు, సేవలకే పన్నులు చెల్లిస్తారని చెప్పిన ఆమె.. కారును కొన్న వారే పన్నులు చెల్లిస్తారని, కొనుగోలు చేయని వారు పన్ను చెల్లించరని వివరించారు. రోడ్డును వినియోగించుకున్న వారే టోల్ ట్యాక్స్ కడతారని, ఇలా చేస్తేనే కొత్త రోడ్లు నిర్మించగలుగుతామని ఆమె (Nirmala Sitharaman) వివరించారు.