Mukesh Ambani : ఆసియాలో ముకేశ్ కుటుంబమే నంబర్ 1

ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ(Mukesh Ambani) కుటుంబం నిలిచింది. ఆసియా (Asia)లో అత్యంత సంపన్నులైన 20 కుటుంబాల జాబితాను బ్లూమ్‌బర్గ్ (Bloomberg) విడుదల చేసింది. ఇందులో 90.5 బిలియన్ డాలర్ల ( రూ.7.86 లక్షల కోట్ల) సంపదతో ముకేశ్ అంబానీ కుటుంబం అగ్రస్థానాన్ని పొందింది. మొత్తం 20 సంపన్న కుటుంబాల జాబితాలో 6 భారతీయ కుటుంబాలే ఉండటం గమనార్హం. మిస్త్రీ ( షాపూర్జీపల్లోంజి గ్రూపు), జిందాల్(Jindal), బిర్లా(Birla), బజాజ్, హిందూజా కుటుంబాలూ ఈ జాబితాలో ఉన్నాయి.