Mukesh Ambani :మహా కుంభమేళాకు ముకేశ్ అంబానీ కుటుంబం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ(Mukesh Ambani), కుటుంబ సమతేంగా మహా కుంభమేళా (Maha Kumbh Mela) లో పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం (Triveni Sangam)లో ముకేశ్ అంబానీతో పాటు ఆయన తల్లి కోకిలాబెన్, కుమారులు ఆకాశ్ -అనంత్, కోడళ్లు శ్లోకా-రాధిక, మనుమలు పృథ్వీ, వేద, అక్కలు దీప్తి, నీనా కొఠారి, ఆయన అత్త పూర్ణిమా, మరదలు మమతా స్నానం ఆచరించారు. అరైల్‌లోని పర్‌మార్థ్ త్రివేణి పుష్ప్‌లో జరిగిన యజ్ఞంలో ఆయన కుటుంబంతో పాల్గొన్నారు. తదుపరి పారిశుద్ధ్య కార్మికులు, పడవలు నడిపేవారికి లైఫ్‌జాకెట్లు(Lifejackets), స్వీట్లు, పళ్లు, హైజీన్ కిట్‌లతో పాటు బహుమతులను అంబానీ కుటుంబం అందించింది.