Tejaswi Surya :ఒక్కటైన ఎంపీ తేజస్వి సూర్య, గాయని శివశ్రీ స్కంద

తమిళనాడుకు చెందిన ప్రముఖ గాయని, భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్ (Shivshri Skanda Prasad) తో బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య (Tejaswi Surya) వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. నగర శివారు కనకపుర రోడ్డులోని ఓ రిసార్టులో వీరి వివాహం జరిగింది. బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు విజయేంద్ర (Vijayendra), పార్టీ జాతీయ సంఘటన కార్యదర్శి బీఎల్ సంతోశ్ (BL Santosh) , పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై (Annamalai), కేంద్ర మంత్రి సోమణ్ణ, అవధూత్ వినయ్ గురూజీ తదితరులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వచ్చే ఆదివారం వివాహవిందు ఏర్పాటు చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.