MP Shashi Tharoor: కాంగ్రెస్‌కు శశిథరూర్ దూరం.. బీజేపీలోకి వెళ్లడం ఖాయమా?

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Congress MP Shashi Tharoor) తన రాజకీయ జీవితంలో కీలక అడుగు వేయనున్నారా? కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికి, బీజేపీ కండువా కప్పుకోనున్నారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. భారత-బ్రిటన్ వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, యూకే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ బిజినెస్ అండ్ ట్రేడ్ జొనాథన్ రేనాల్డ్స్ చర్చలు జరిపారు. వీరిద్దరినీ కలిసిన శశిథరూర్ (MP Shashi Tharoor).. వారితో కలిసి తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు తిరిగి మొదలవడాన్ని ఆయన స్వాగతించారు. ఈ సోషల్ మీడియా పోస్ట్ చూసిన వారంతా కూడా.. ఆయన (MP Shashi Tharoor) కాంగ్రెస్‌కు దూరమవుతున్నారంటున్నారు.
కాగా, శశిథరూర్ (MP Shashi Tharoor) రాజకీయ భవితవ్యం గురించి తీవ్రంగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై థరూర్ ప్రశంసలు గుప్పించారు. అలాగే సీపీఎం ప్రభుత్వ విధానాలపై కూడా సానుకూల వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన (MP Shashi Tharoor) కాంగ్రెస్ పార్టీ వీడనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. తన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలపై స్పందించిన థరూర్ (MP Shashi Tharoor).. తను ఎలాంటి తప్పు చెయ్యలేదన్నారు. కేరళ స్టార్టప్ రంగ పురోగతిని వివరించానని, సీపీఎం విధానాలను మెచ్చుకోలేదని స్పష్టం చేశారు. అలాగే మోదీ అమెరికా పర్యటనపై వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. ‘‘దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడడం కూడా తప్పేనా?’’ అని కాంగ్రెస్ వర్గాలను ప్రశ్నించారు.
ఈ విమర్శల నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ‘కాంగ్రెస్‌కు నేను కట్టుబడి ఉంటాను. అయితే పార్టీ కనుక నేను వద్దని అనుకుంటే.. నా వద్ద చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి’ అని చెప్పారు. ఆ వెంటనే థరూర్ (MP Shashi Tharoor) కనుక కాంగ్రెస్ వీడితే.. ఆయన రాజకీయ అనాథగా ఉండబోరంటూ సీపీఎం సీనియర్ నేత థామస్ ఐజాక్ కామెంట్ చేశారు. ఇది జరిగిన వెంటనే.. పీయూష్ గోయల్‌తో థరూర్ సెల్ఫీ దిగడం చర్చలకు దారితీసింది.