Maha Kumbh Mela: ఆ దేశ జనాభాల కంటే కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారే ఎక్కువ!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాలో (Maha Kumbh Mela) కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరి 13న మహాకుంభ మేళా ప్రారంభమైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల వివరాలను యూపీ సర్కారు వెల్లడించింది. ఈ సమయంలో ఏకంగా 50 కోట్ల మందికిపైగా భక్తులు మహాకుంభ మేళాలో (Maha Kumbh Mela) పాల్గొన్నారని ప్రకటించింది. “ఇది చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్ర. ఇప్పటికి 50 కోట్ల మందికిపైగా భక్తులు మహాకుంభ మేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. భారత్, చైనాలు తప్ప మిగతా దేశాల జనాభా కంటే.. కుంభ మేళాలో (Maha Kumbh Mela) పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్యే ఎక్కువ. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్లు లేదు” అని యూపీ సర్కారు పేర్కొంది. ప్రయాగ్రాజ్‌లో గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో ఒక్క శుక్రవారం నాడే ఏకంగా 92 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.