NDIA Bloc: ఇండియా కూటమి కొనసాగాలన్న 65 శాతం ప్రజలు: మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) పార్టీలు వేటికవే పోటీలు చేయాలని నిర్ణయించుకోవడం కూటమిని బాగా దెబ్బతీసింది. ఈ చీలికల నేపథ్యంలో విపక్ష పార్టీలు ఇండియా కూటమిని రద్దు చేస్తాయని కూడా కొందరు భావిస్తున్నాయి. అయితే ప్రజలు మాత్రం విపక్షాలు ఇండియా కూటమిని (INDIA Bloc) కొనసాగిస్తేనే మంచిదని భావిస్తున్నారు. తాజాగా చేసిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ఈ సర్వేలో మొత్తం 1.25 లక్షల మందికిపైగా ప్రజల అభిప్రాయాలను సేకరించారు. వీరిలో 65 శాతం మంది.. ఇండియా కూటమి (INDIA Bloc) కొనసాగితేనే మంచిదని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో ఇండియా కూటమి తడబడినా కూడా.. విపక్షాలు ఈ కూటమిని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నాయి. అయితే 26 శాతం ప్రజలు మాత్రం ఇండియా కూటమి పూర్తిగా విఫలమైన నేపథ్యంలో.. ఇలా ఒక్కో చోట కూటమి (INDIA Bloc) పార్టీలు ఒకదానితో మరొకటి పోటీ చేయడం కంటే కూటమిని రద్దు చేసేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. అలాగే ఇండియా కూటమికి (INDIA Bloc) నాయకుడిగా ఎవరుండాలనే ప్రశ్నకు 24 శాతం మంది ప్రజలు రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదించారు. 14 శాతం మంది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మద్దతిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఇండియా కూటమి (INDIA Bloc) పగ్గాలు అందించాలని 9 శాతం మంది కోరగా.. మరో 9 శాతం మంది సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పేరును సూచించారు.