Modi: సుప్రీంకోర్టు, న్యాయమూర్తులకు ధన్యవాదాలు : మోదీ

రాజ్యాంగం కన్నకలలను సాకారం చేసేందుకు దేశంలో అమల్లోకి వచ్చిన సరికొత్త నేర నియంత్రణ చట్టాలు బలమైన ముందడుగుగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అభివర్ణించారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్లలో దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలను జాగ్రత్తగా అధ్యయనం చేసి వీటిని రూపొందించారన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. చండీగఢ్ (chandigarh) కు వస్తే నా మనుషుల మధ్యకు వచ్చినట్లు ఉంటుంది. ఈ నగరం శక్తిస్వరూపిణి చండీ అమ్మవారి పేరుతో ముడిపడిరది. ఆమె సత్యం, న్యాయాన్ని నిలబెట్టారు. ఇదే భావనతో భారత న్యాయసంహిత చట్టాలు ఉన్నాయి. వీటి పరిధిలోకి దేశం రావడం చాలా గొప్ప ఆరంభం. ప్రజల కోసం మన రాజ్యాంగా ఏమీ ఆదర్శాలను ఊహించుకున్నామో వాటిని పూర్తి చేయడానికి ఇవొక కీలక ప్రయత్నం. ఈ చట్టాలు ఎలా అమలు చేస్తారనేది లైవ్ డెమ్ చూశాను. ప్రజలు కూడా వీటిని చూడాలని కోరుతున్నాను అని అన్నారు.