Modi :అది కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పే : మోదీ

సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనే భావనను కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమే అవుతుందని ప్రధాని మోదీ (Modi) విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా ఉందని కొనియాడారు. అది మనందరికీ ముందుకు సాగే మార్గాన్ని చూపించిందని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభ (Rajya Sabha) లో ప్రసంగించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసమే మా కార్యక్రమాలు ఉంటాయి. పదేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నాం. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నాం. దీనిని కాంగ్రెస్ (Congress) నుంచి ఆశించడం పెద్ద తప్పిదమే అవుతుంది. అది వారి ఆలోచన పరిధిని దాటి ఉంటుంది. ఆ పార్టీ మొత్తం ఒక కుటుంబానికే అంకితమైంది. నేషన్ ఫస్ట్(Nation First) అనేది మా విధానం. దేశానికి ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించాలి. విద్యారంగం అభివృద్ధి దిశగా మా ప్రభుత్వ పథకాలన్నీ ఉంటాయి అని వెల్లడిరచారు.