Narendra Modi :ఇది 140 కోట్ల మంది ఆశలు నెరవేర్చే బడ్జెట్ : ప్రధాని మోదీ

కేంద్రంలో ఎన్డీయే సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ పై ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) స్పందించారు. ఇది 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ (Budget )అని కొనియాడారు. దీంతో పొదుపు, పెట్టుబడులు (Investments) పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పద్దు దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుందని పేర్కొన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్. అనేక రంగాల్లో యువతకు అవకాశాలను కల్పిస్తున్నాం. బడ్జెట్‌లు సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ, ఈ బడ్జెట్ మాత్రం ప్రజల (People’s) జేబులు నింపేందుకు, సేవింగ్స్ (Savings) పెంచేందుకు ఉద్దేశించింది. ఈ బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదు. అన్ని ఆదాయ వర్గాలకు పన్నులకు తగ్గించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.