AP Tourism: సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్-2025 లో మంత్రి దుర్గేష్

ఢిల్లీ(Delhi) లో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ – 2025 (South Asia Leading Travel & Tourism) వేదికగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఏపీ పర్యాటకాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆహ్వానం పలకడం జరిగింది.
సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని వివరించాను.
పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చి, టెంపుల్, అడ్వెంచర్, ఎకో, వెల్ నెస్, హెరిటేజ్, రిలీజియస్, అగ్రి, మెడికల్, క్రూయిజ్, బీచ్, కోస్టల్, సీప్లేన్, రూరల్, ఫిల్మ్ టూరిజంలను వృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని తెలిపి, అద్భుత ప్రకృతి రమణీయతకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అని తెలుపుతూ రాష్ట్ర సందర్శనకు రావాలని ఇన్వెస్టర్లను కోరాను.