తమ మెగా బ్లాక్‌బ్లస్టర్ సేల్‌లో 3.34 కోట్ల ఆర్డర్లను అందుకున్న మీషో
భారతదేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో అత్యుత్తమ పండుగ విక్రయాలను తమ ప్రతిష్టాత్మక మీషో మెగా బ్లాక్‌బ్లస్టర్ సేల్‌లో అందుకుంది ఈ అమ్మకాలు సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 27, 2022 వరకూ జరిగాయి. ఈ ఐదు రోజుల కార్యక్రమంలో ఏకంగా 3.34 కోట్ల ఆర్డర్లను వినియోగదారులు అందించారు. గత సంవత్సర విక్రయాలతో పోలిస్తే 68% వృద్ధిని నమోదు చేశారు.
ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ కామర్స్‌ను దగ్గర చేయాలనే మీషో ప్రయత్నాలు సఫలమయ్యాయి. దాదాపు 60% ఆర్డర్లు టియర్ 4+ నగరాల నుంచి వచ్చాయి. ఈ అమ్మకాలలో లావాదేవీలు జరిపిన వినియోగదారుల సంఖ్య 60%కు పైగా పెరిగింది.
దేశవ్యాప్తంగా ఆర్డర్లు రాగా పండుగ అమ్మకాల పరంగా గణనీయమైన వృద్ధి కనిపించింది. పరిశ్రమలో మొట్టమొదటిసారిగా జీరో కమీషన్ కార్యక్రమం ప్రారంభించడంతో ఎంఎస్ఎంఈలు భారీ ఎత్తున డిజిటల్‌గా కార్యక్రమాలు ప్రారంభించడం చేశారు. దీని ద్వారా వారు దాదాపు 104 కోట్ల రూపాయలను కమీషన్ల రూపంలో ఆదా చేసుకున్నారు. అంతేకాదు దాదాపు 20వేల మంది విక్రేతలు లక్షాధికారులు కాగా, 24 మంది కోటీశ్వరులయ్యారు.
మీషో ఫౌండర్, సీఈఓ విదిత్ ఆత్రేయ్ మాట్లాడుతూ ‘‘ఈ సంవత్సరం భారత్ పండుగ షాపింగ్అవసరాలను మీషో యొక్క మెగా బ్లాక్‌బ్లస్టర్ సేల్ తీర్చింది. ఈ పండుగ అమ్మకాలలో దాదాపు 80%కు పైగా ఆర్డర్లు టియర్2+ మార్కెట్ ల నుంచి వచ్చాయి’’ అని అన్నారు
ఈ సంవత్సరం అమ్మకాలలో కిచెన్ యుటిలిటీస్ 116% వృద్ధి చెందగా, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ 109% వృద్ది చెందింది, లగేజీ, టావెల్ యాక్ససరీలు 99% వృద్ధి చెందాయి, ఇతర విభాగాలలో ఫ్యాషన్, హోమ్ అండ్ కిచెన్ , పరనల్ కేర్ వంటివి ఉన్నాయి.






