Mayawati :మాయవతి కీలక నిర్ణయం .. పార్టీ నుంచి

తాను బతికున్నంత కాలం పార్టీలో తన రాజకీయ వారసుడంటూ ఎవరూ ఉండబోరని బహుజన్ సమాజ్ పార్టీ (Bahujan Samaj Party) అధ్యక్షురాలు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం మాయవతి (Mayawati) సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆమె, తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ (Akash Anand )ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. పార్టీకి సంబంధించి అన్ని కీలక పదవుల నుంచి అతడిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజులోపే బీఎస్పీ (BSP ) అధినేత్రి ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.