Manipur CM: మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా

కొన్నేళ్లుగా జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ (Manipur CM Resigns) తన పదవికి రాజీనామా చేశారు. బీరెన్ సింగ్ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లాను కలిసి రాజీనామా పత్రం అందజేశారు. బడ్జెట్ సమావేశాల సమయంలో బీరెన్ సింగ్ రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిప బీరెన్ సింగ్.. మణిపూర్ ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తనకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆయన (Manipur CM Resigns) అన్నారు.
మణిపూర్ అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు తీసుకుందని, రానున్న రోజుల్లోనూ ఈ అభివృద్ధి కొనసాగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు తథ్యమని కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆదివారం ఢిల్లీ వెళ్లిన బీరెన్ సింగ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలను కలిశారు. ఆ తరువాత సాయంత్రానికే ఆయన (Manipur CM Resigns) తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.