Mamata Banerjee: మేము కోరుకుంటున్నదీ అదే.. త్వరలోనే

అవకాశం ఇస్తే ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రకటించిన విషయం తెలిసిందే. దీదీ ప్రకటనపై శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) తాజాగా స్పందించారు. తాము కోరుకుంటున్నది కూడా అదే అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు త్వరలో కోల్‌కతా (Kolkata) వెళ్లనున్నట్లు చెప్పారు. మమతా జీ అభిప్రాయం మాకు తెలుసు. ఆమె భారత కూటమిలో ప్రధాన భాగస్వామి కావాలనే మేమూ కోరుకుంటున్నాం. దీదీ అయినా, అరవింద్ కేజ్రీవాల్ అయినా, శివసేన అయినా మేమంతా కలిసే ఉన్నాం. ఈ విషయంపై మమతా బెనర్జీతో మాట్లాడేందుకు మేము త్వరలో కోల్‌కతా వెళ్తాం అని సంజయ్ మీడియాకు తెలిపారు.