Mamata Banerjee: అది మహాకుంభ్ కాదు ‘మృత్యుకుంభ్’.. సీఎం మమత షాకింగ్ కామెంట్స్

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్న ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక మహాకుంభమేళాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మహా కుంభమేళాను ఆమె “మృత్యు కుంభ్”గా వర్ణించారు. కుంభమేళా అంటే తనకు గౌరవం ఉందని, గంగా మాతకు తన హృదయంలో పవిత్రమైన స్థానం ఉందని చెప్పిన మమత.. యూపీలో జరుగుతున్న ఈ మహాకుంభమేళాలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
యూపీ సర్కారు కేవలం వీఐపీలకు మాత్రమే ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, సామాన్య ప్రజలకు కనీస సదుపాయాలు అందించడంలో కూడా విఫలమైందని సీఎం మమత (CM Mamata Banerjee) తీవ్రంగా విమర్శించారు. “కుంభమేళాలో ధనవంతులు రూ.1 లక్ష ఖర్చు చేసి టెంట్లు బుక్ చేసుకుంటున్నారు, కానీ పేద ప్రజలు ఇలాంటి ఖర్చులు భరించగలరా?” అని ఆమె ప్రశ్నించారు. తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉందని తెలిసినా.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని ఆమె (CM Mamata Banerjee) విమర్శించారు. “ఒక పక్కా ప్లాన్ లేకుండా ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడమే. ఇది ప్రభుత్వం అసమర్థతను, నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది,” అని ఆమె (CM Mamata Banerjee) మండిపడ్డారు.