Mallikarjun Kharge: వికసిత్ భారత్ వల్ల ప్రజల జేబులు ఖాళీ: మల్లికార్జున ఖర్గే

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రచారం చేస్తున్న ‘వికసిత్ భారత్’ (Viksit Bharat).. దేశ ప్రజల జేబులు ఖాళీ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విధానాలు కేవలం కొద్దిమంది ధనికులకు మాత్రమే లబ్ది చేకూరుస్తున్నాయని, సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులు మాత్రం రోజురోజుకూ దిగజారుతున్నాయని ఖర్గే అన్నారు. భారతదేశం ప్రస్తుతం పన్నులు, వాణిజ్య ఆంక్షలతో పోరాడుతోందని ఖర్గే (Mallikarjun Kharge) చెప్పారు. ‘‘మోదీజీ (PM Modi).. ఖర్చు చేయడానికి కోట్లాది భారతీయుల దగ్గర ఆదాయం లేదు. దేశ జీడీపీలో 60 శాతం ప్రజలు ఖర్చు చేయడంపైనే ఆధారపడి ఉన్నారు. కానీ, దేశంలో 90 శాతం మంది ప్రజలు ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు’’ అని ఆయన (Mallikarjun Kharge) మండిపడ్డారు.
‘‘పన్ను చెల్లిస్తున్న ప్రజల్లో 50 శాతం మందికి గత దశాబ్ద కాలంలో జీతాలు పెరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీతాల పెరుగుదల నిలకడగా లేదు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ (NDA Government) విధానాలు ప్రజల ఆదాయాలను పెంచడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పన్నుల విషయంలో భారత్ పోరాడుతోంది. వాణిజ్య రంగంలోనూ అనేక అడ్డంకులు ఉన్నాయి. నిరుద్యోగం ఊబిలో యువత చిక్కుకుపోయింది. ద్రవ్యోల్బణం ప్రజలను పీడిస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదు. మీరు ప్రచారం చేస్తున్న ‘వికసిత్ భారత్’ (Viksit Bharat) కేవలం సాధారణ ప్రజల జేబులను ఖాళీ చేస్తోంది. కొంతమంది ధనికుల ఖజానాలు నింపుతోంది’’ అని మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆగ్రహం వ్యక్తం చేశారు.