Mallikarjun Kharge: మోదీ ‘క్లోజ్ ఫ్రెండ్’.. భారతీయులను బానిసల్లా చూస్తున్నాడు: మల్లికార్జున ఖర్గే

అమెరికా నుంచి అనేక మంది భారతీయులను వెనక్కు పంపడంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ‘క్లోజ్ ఫ్రెండ్’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసుకుంటారని, కానీ ఆయన ‘క్లోజ్ ఫ్రెండ్’ మాత్రం మనవాళ్లను బానిసల్లా చూస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. అమెరికా నుంచి వెనక్కు పంపిస్తున్న వారిని అమానవీయంగా ట్రీట్ చేస్తున్నారని, కాబట్టి అక్కడి నుంచి వెనక్కు పంపిస్తున్న భారతీయుల కోసం భారత ప్రభుత్ం సొంత విమానం పంపించాలని ఖర్గే (Mallikarjun Kharge) డిమాండ్ చేశారు. అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ.. ఈ విషయమై ట్రంప్‌తో చర్చించాలని ఆయన సూచించారు. ‘అమెరికా మన మిత్ర దేశం. ఏ విషయాన్నయినా నేను పరిష్కరిస్తాను’ అని చెప్పుకుంటున్న మోదీ.. ఇప్పుడీ సమస్యను కూడా పరిష్కరించాలని ఖర్గే చెప్పారు. మోదీ మాట నిజంగా ట్రంప్ వినేటట్లయితే.. భారతీయులను ప్రయాణికుల విమానంలో కాకుండా ఇలా రవాణా విమానంలో ఎందుకు పంపిస్తారని ఖర్గే (Mallikarjun Kharge) క్వశ్చన్ చేశారు.