అమెరికా వైమానిక దిగ్గజం లాఖీడ్ మార్టిన్‌తో .. టీఏఎస్‌ఎల్ ఒప్పందం

అమెరికా వైమానిక దిగ్గజం లాఖీడ్ మార్టిన్-టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) మధ్య మరో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారత వైమానిక దళాని (ఐఏఎఫ్)కి అవసరమైన మధ్య రకం సైనిక రవాణా విమానాల (ఎంటీఏ) సరఫరా కాంట్రాక్టుత కోసం పోటీపడాలని లాఖీడ్ మార్టిన్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఏఎన్-32 విమానాల స్థానంలో 80 సరికొత్త ఎంటీఏ విమానాలు సమకూర్చుకోవాలని భారత వైమానిక దళం భావిస్తోంది. ఇందుకు తన సీ-130జే సూపర్ హెర్య్యులస్ విమానాలు సరఫరా చేసేందుకు లాఖీడ్ బిడ్ సమర్పించింది. ఈ కాంట్రాక్టు దక్కితే ఈ విమానాలను భారత్‌లోనే తయారు చేసేందుకు టీఏఎస్‌ఏల్‌తో ఒప్పందం ఉపకరిస్తుందని భావిస్తోంది. లాఖీడ్ మార్టిన్‌తో పాటు ఎయిర్ బస్, ఎంబ్రాయర్ కంపెనీలు కూడా ఈ కాంట్రాక్టు కోసం పోటీపడుతున్నాయి. ఈ కాంట్రాక్టు దక్కితే సీ-130 జే సూపర్ హెర్క్యులస్ విమానాల నిర్వహణ, మరమ్మతుల కోసం ఎంఆర్‌ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అమెరికా వైమానిక దిగ్గజం ఆసక్తితో ఉంది.