Akhilesh Yadav: కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలి: అఖిలేష్ యాదవ్

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంభ మేళాను మరికొద్ది రోజులపాటు పొడిగించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కోరారు. లక్షలాది మంది భక్తజనం ఈ కుంభ మేళాకు పోటెత్తుతున్నారు. అలాగే ఈ కుంభ మేళాలో పాల్గొనేందుకు వచ్చిన వేలాది మంది.. ఇంకా రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కొని ఉన్న నేపథ్యంలోనే అఖిలేష్ ఈ విజ్ఞప్తి చేశారు. గతంలో మహాకుంభ్, కుంభ మేళాలు 75 రోజుల పాటు జరిగేవని, ఇప్పుడు మాత్రం కుంభ మేళాకు నిర్దేశించిన రోజులు తక్కువగా ఉన్నాయని అఖిలేష్ (Akhilesh Yadav) అభిప్రాయపడ్డారు. ”ఇప్పుడు కూడా చాలా మంది మహాకుంభ మేళాకు వెళ్లాలని అనుకున్నా వెళ్లలేకని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మహాకుంభ్‌ను మరికొన్ని రోజులపాటు ప్రభుత్వం పొడిగించాలి” అని అఖిలేష్ (Akhilesh Yadav) అన్నారు. కాగా, కొన్నిరోజులుగా మహాకుంభ మేళాకు వెళ్తున్న రైళ్లు, రోడ్లు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్న సంగతి తెలిసిందే. ఘాట్లకు వెళ్లే దారిలో అయితే కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్‌లు కట్టాయి. ఇంత రద్దీ ఉండటంతో ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.