తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సంద్భంగా కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి. చార్‌ధామ్ యాత్రలో కేదార్ నాథ్ దేవాలయం సందర్భన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే, శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక దాదాపు ఆరు నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం నేడు తెరిచారు.