Delhi: తెలంగాణలో క్రీడా రంగం అభివృద్ధిపై కపిల్ దేవ్ ప్రశంస… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ…

హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ఆయన అధికారిక నివాసంలో కపిల్ దేవ్ (Kapil Dev) సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి కపిల్ దేవ్ కు వివరించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో తాను భాగస్వామినవుతానని కపిల్ దేవ్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియాతో పాటు పలు దేశాల్లో తాము సందర్శించిన క్రీడా యూనివర్సిటీలు.. అక్కడి క్రీడా ప్రముఖులతో తమ భేటీల వివరాలను సీఎం రేవంత్ రెడ్డి కపిల్ దేవ్‌కు తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.