రిలయన్స్ సంస్థ కీలక ప్రకటన.. దసరా నుంచే ఆ నగరాల్లో
దేశంలో 5జీ సేవలకు సంబంధించి రిలయన్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. దీపావళి కానుకగా 5జీ సేవల్ని అందుబాటులోకి తెస్తామని ఇటీవల ప్రకటించిన ఆ సంస్థ ట్రయల్ బేసిస్‌పై దసరా నుంచే ఈ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసి, నగరాలో ట్రయల్ బేసిస్ ఆధారంగా అక్టోబర్ 5 నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. జియో ట్రూ 5జీ వెల్కం ఆఫర్ కింద ఈ పైన పేర్కొన్న నగరాలలో జియో యూజర్లకు బీటా ట్రయల్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు 5జీ ప్రపంచంలోనే అత్యంత అధునాతన 5జీ సర్వీసులుగా భావిస్తున్నారు. జియో వెల్కమ్ ఆఫర్ కింద ఉన్న యూజర్లు ఆలోమేటిక్‌గా జియో ట్రూ 5జీ సర్వీస్‌కు అప్‌గ్రేడ్ అవుతారని ఇందుకోసం జియో సిమ్‌గానీ, 5జీ హ్యాండ్‌సెట్‌గానీ మార్చాల్సిన అవసరం లేదని పేర్కొంది.






