Jairam Ramesh: మణిపూర్‌ను ప్రధాని పట్టించుకోవడం లేదు: జైరాం రమేష్

జాతుల మధ్య వివాదాలతో మణిపూర్ (Manipur) అల్లకల్లోలంగా మారి రాష్ట్రపతి పాలన విధించినా కూడా అక్కడి పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తి చూపడం లేదని కాంగ్రెస్ (Congress) మండిపడింది. ఇటీవల ప్రధాని మోదీ.. మధ్యప్రదేశ్, బీహార్, అస్సాంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన విషయాన్ిన కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) గుర్తుచేశారు. అయితే మణిపూర్‌ను మాత్రం ప్రధాని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అస్సాంలో పర్యటించిన మోదీ అక్కడ ఒకరోజు బస చేసినా, సమీపంలో ఉన్న మణిపూర్ మాత్రం వెళ్లకుండా మౌనంగా ఉండిపోవడం బాధ్యతారాహిత్యమేనని నేత జైరాం రమేష్ (Jairam Ramesh) విమర్శించారు.
‘‘మణిపూర్‌లో ప్రజలు నెలలుగా అల్లకల్లోలం ఎదుర్కొంటున్నారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే ప్రధాని (PM Modi) మాత్రం మణిపూర్ ప్రజలను పట్టించుకోవడం లేదు. అసలు ఆయన అక్కడకు ఎప్పుడు వెళ్తారు?’’ అని ప్రశ్నించారు. మణిపూర్ (Manipur) రాష్ట్రంలో శాంతిభద్రతలు బలహీనపడిన నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా అనంతరం కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.