Isha Foundation: ఈశా కేంద్రంలో ఘనంగా శివరాత్రి వేడుకలు

కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈశా ఫౌండేషన్ (Isha Foundation) వ్యవస్థాపకుడు సద్దురు జగ్గీ వాసుదేవ్ (Sadduru Jaggi Vasudev) ఉదయం ధ్యాన లింగానికి అభిషేకం, దీపారాధన చేశారు. సాయంత్రం వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పాల్గొన్నారు. కైలాసగిరుల నుంచి తీసుకొచ్చిన తీర్థంతో జగ్గీ వాసుదేవ్, అమిత్ షా శివలింగానికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కవృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar), మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ (L. Murugan) తదితర పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.