ఐపిఎల్ మెగా ఆక్షన్… అనామకులకు కోట్లాభిషేకాలు, దిగ్గజాలకు దండాలు

ఐపిఎల్ మెగా ఆక్షన్ ముగిసింది. వందలాది మంది ఆటగాళ్ళ భవిష్యత్తుకు డైమండ్ బాటలు వేసే కాసుల లీగ్ కు వేలం పాట ముగిసింది. 42 ఏళ్ళ అండర్సన్ అనే దిగ్గజం నుంచి 13 ఏళ్ళ వైభవం సూర్య వంశీ అనే పిల్లాడి వరకు ఎందరో ఆటగాళ్ళు తమ అద్రుష్టం పరీక్షించుకున్నారు. ఈ వేలంలో ఎవరిని అద్రుష్టం వరించింది అంటే టక్కున చెప్పే మాట అనామకులను. అసలు ఏ మాత్రం అంచనాలు లేని ఆటగాళ్లను అని చెప్పవచ్చు. శ్రేయాస్ అయ్యర్ నుంచి ప్రియాన్ష్ అనే పిల్లాడి వరకు ఎందరో అంచనాలకు మించి వేలంలో అమ్ముడుపోయారు.
శ్రేయాస్ అయ్యర్ కు 26.75 కోట్లు పెట్టడం చూసి అందరూ నివ్వెర పోయారు. కోల్కతాను విజేతగా నిలపడంలో అతని పాత్ర ఉన్నా సరే అంత ఖర్చు పెట్టే అంత సీన్ అయితే లేదు. ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే… పొగిడే వాళ్ళ కంటే తిట్టే వాళ్ళు ఎక్కువయ్యారు. పంత్ కు 27 కోట్లు ఓకే గాని అంత సీన్ ఉంది అంటారా అనే ప్రశ్నలు వినిపించినా… మనాడి అంతర్జాతీయ వైట్ బాల్ క్రికెట్ ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా ఏం లేదు. కాని ఐపిఎల్ లో మాత్రం మంచి ఆటగాడు అని చెప్పాలి. కాని కెప్టెన్ గా అంత సమర్ధత ఉన్న ఆటగాడు కాదు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉంది.
కెఎల్ రాహుల్ విషయానికి వస్తే క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయింది, షేక్ అయింది, సైలెంట్ అయింది ఇక్కడే. దాదాపు 25 కోట్లు పలుకుతాడు అనుకున్న ఈ కర్ణాటక ఆటగాడు… కేవలం 14 కోట్లు మాత్రమే పలికాడు. దీనితో అతని ఫ్యాన్స్ బాధ పడ్డారు. లక్నోలో ఉంటె 20 కోట్లు వచ్చేవిగా అనే కామెంట్స్ వచ్చినా ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చాడు అనే ఫీల్ ఉంది ఫ్యాన్స్ లో. ఇక చాహల్ విషయానికి వస్తే ఈ బక్క లెగ్ స్పిన్నర్ కు 18 కోట్లు పెట్టడం సాహసం అనే చెప్పాలి. ఐపిఎల్ అత్యధిక వికెట్ల రికార్డ్ అతని పేరు మీదనే ఉంది.
శమికి కంటే గొప్ప బౌలర్ కాదు… కాని శమి కంటే 7 కోట్లు ఎక్కువకు అమ్ముడు పోయాడు ఈ ఆటగాడు. ఇక భారీ ధర పలుకుతాడు అని ఎదురు చూసిన వాషింగ్టన్ సుందర్ కు కేవలం 3.2 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ కు ఘజన్ ఫర్ కు 4.8 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక నూర్ అహ్మద్ కు భారీగానే వెచ్చించారు. 10 కోట్లు ఖర్చు చేసారు. సీనియర్ ప్లేయర్ భువనేశ్వర్ కోసం ఆర్సీబీ ఏకంగా 10.75 కోట్లు ఖర్చు పెట్టింది. తుషార్ దేశ్ పాండే అందరి అంచనాలు తలకిందులు చేసాడు.
రాజస్థాన్ రాయల్స్ అతని కోసం ఏకంగా 6.5 కోట్లు ఖర్చు చేసింది. గత సీజన్ లో అతన్ని చెన్నై కేవలం 20 లక్షలకే కొనుక్కుంది. భారీగా పరుగులు ఇచ్చినా కీలక సమయాల్లో వికెట్లు తీస్తాడు అనే పేరు ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యారు. అర్శదీప్ సింగ్ కు ఏకంగా 18 కోట్లు ఖర్చు చేసారు. రాబాడా 10.75 కోట్లు, స్టార్క్ 11.75 కోట్లు హెజిల్ వుడ్ 12 కోట్ల 50 లక్షలు… ప్రసిద్ కృష్ణకు 9.5 కోట్లు… ఆవేశ్ ఖాన్ కు 9 కోట్ల 75 లక్షలు… ఇలా పేస్ బౌలర్లకు బాగా ఖర్చు చేసాయి టీమ్స్.
అయితే కొందరు కీలక ఆటగాళ్లకు మాత్రం నిరాశే మిగిలింది. వెటరన్ ప్లేయర్స్ ను మాత్రం అసలు పట్టించుకోలేదు. జడేజా, అశ్విన్ లకు భారీగానే ఖర్చు చేసినా… విలియమ్సన్, అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఇలా కొందరు ఆటగాళ్లను అసలు కొనలేదు. ఇక దిగ్గజ ఆటగాళ్లుగా పేరున్న రహానే, విలియమ్సన్, అండర్సన్, స్టీవ్ స్మిత్ సహా కొందరిని కొనడానికి ముందుకు రాలేదు. యువ ఆటగాడు పృథ్వీ షా కెరీర్ దాదాపుగా ఐపిఎల్ లో ముగిసినట్టే. రహానే కెరీర్ పైనే క్లారిటీ రావాల్సి ఉంది. గత సీజన్ లో రహానే మెరుపులు మెరిపించాడు. ఏది ఎలా ఉన్నా అనామకులు మాత్రం ఈ సీజన్ లో భారీ ధరకు అమ్ముడు కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. అందరికంటే షాకింగ్ శ్రేయాస్ అయ్యర్…!