ఇన్ఫోసిస్ కీలక ప్రకటన… వారు ఇకపై
వర్క్ ఫ్రం హోమ్ విషయంలో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకూ ఇంట్లోంచే విధులు నిర్వర్తిస్తున్న వారు ఇకపై నెలకు కనీసం పది రోజులపాటు ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎంట్రీ లెవెల్ నుంచి మధ్య స్థాయి ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఇప్పటికే ఈమెయిళ్ల ద్వారా ఉద్యోగులకు తెలియజేసినట్లు తెలిపింది. బ్యాండ్ 5, 6 స్థాయుల్లో ఉద్యోగుల (మిడ్ లెవల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ హెడ్లు, ఎంట్రీ లెవల్ ఉద్యోగులు)కు నెలలో 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాలని మెయిల్ పంపారు.






