Modi : ప్రధాని మోదీతో ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు లెయెన్ భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రaళిపిస్తున్న ప్రతీకార సుంకాల కొరడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ముప్పుందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ భారత్, ఐరోపా యూనియన్ (ఈయూ) కమిషన్ కీలక ప్రకటన చేశాయి. తమ మధ్య దీర్ఘకాలంగా చర్చల్లో నానుతున్న మెగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఈ ఏడాది చివరికల్లా పట్టాలెక్కించనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సంప్రతింపులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపాయి. రక్షణ, భద్రత, సాంకేతికత సహా పలురంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించుకోవాలని కూడా భారత్, ఈయూ నిర్ణయించాయి.
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్ (Ursula Vander Leyen) ఢల్లీిలో ప్రధాని మోదీ (Modi)తో భేటీ అయ్యారు. ఈయూ, ఢల్లీి మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. తమ సన్నిహిత మిత్ర దేశాలైన జపాన్ (Japan), దక్షిణ కొరియా (South Korea )లతో కుదుర్చుకున్న తరహాలో భారత్‌తోనూ భద్రత, రక్షణ ఒప్పందాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు లెయెన్ తెలిపారు. 2025 తర్వాత ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మార్గదర్శనం చేసే రోడ్‌మ్యాప్‌ను ఇప్పటికే సిద్ధం చేశామని, ఈ ఏడాది భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సులో దాన్ని ఆవిష్కరిస్తామని మోదీ పేర్కొన్నారు.