U-19 World Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. అఫ్గాన్‌పై ఘన విజయం!
అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో (U-19 World Cup) భారత యువజట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. హరారే వేదికగా జరిగిన సెమీఫైనల్ పోరులో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 53 బంతులు మిగిలి ఉండగానే (41.1 ఓవర్లలో) అలవోకగా ఛేదించి, టైటిల్ పోరుకు సిద్ధమైంది.
భారీ లక్ష్య ఛేదనలో (U-19 World Cup) హైదరాబాద్‌కు చెందిన ఆరోన్ జార్జ్ (115) అద్భుత శతకంతో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 33 బంతుల్లోనే 68 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే (62) కూడా అర్ధశతకంతో రాణించాడు. చివర్లో విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది లాంఛనాన్ని పూర్తి చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అంతకుముందు (U-19 World Cup) బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. ఇక శుక్రవారం జరగబోయే ఫైనల్ పోరులో భారత్, ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇప్పటికే ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన భారత్.. ఆరోసారి కప్పుపై కన్నేసింది.






