Atishi: ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం ఆతిశీకి ఊరట

అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ(Atishi) కి ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ (BJP) దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌ను నగరంలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) కొట్టివేసింది. ఆమె మొత్తం పార్టీని ఉద్దేశించి మాట్లాడారని, ఒక్క వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానించలేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఆమెకు ఈ కేసులో ఉపశమనం లభించింది.గతేడాది లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల ముందు మంత్రిగా వ్యవహరించిన ఆతిశీ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీలో చేరకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆప్ నేతలను అరెస్టు చేస్తుందని కాషాయ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు బెదిరించాని ఆమె ఆరోపించారు. దీంతో ఆతిశీకి వ్యతిరేకంగా బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.