ప్రవాస భారతీయుల కోసం ఐసీఐసీఐ బ్యాంకు … స్మార్ట్ వైర్
ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) ఇక్కడి బంధుమిత్రులకు ఆన్లైన్లో సులువుగా నగదు బదిలీ కోసం ఐసీఐసీఐ బ్యాంకు స్మార్ట్ వైర్ సదుపాయాన్ని ఆవిష్కరించింది. దీనివల్ల స్విఫ్ట్ ఆధారిత రెమిటెన్స్ సేవలను ఎంతో వేగంగా, సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు. ఈ విధానంలో వైర్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ తో నగదు బదిలీ ప్రక్రియను ప్రారంభించాలి. ఆన్లైన్లో డిక్లరేషన్, ఇతర పత్రాలు సమర్పించాలి. మారకపు రేటును ముందుగానే నిర్ణయించుకుని, తదుపరి నగదు బదిలీ పూర్తి చేయొచ్చు. నగదు బదిలీ చేసిన వినియోగదారుడికి, ఆ లావాదేవీకి సంబంధించిన అన్ని వివరాలతో వెంటన్ ఇ`మెయిల్ వస్తుందని ఐసీఐసీఐ బ్యాంకు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ హెడ్ శ్రీరామ్ అయ్యార్ తెలిపారు.






