PM Modi: మహాకుంభ్‌లో అసౌకర్యం కలిగి ఉంటే క్షమించండి: ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం అయిన ‘మహాకుంభమేళా’ (Maka Kumbh Mela) గొప్పగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ పవిత్ర వేడుక (Kumbh Mela) విశిష్టతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన బ్లాగ్‌లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం సాధారణ విషయం కాదని, ఏర్పాట్లలో ఏవైనా లోపాలు లేదా అసౌకర్యాలు ఉండుంటే, అవి అనివార్యమైనవి కాబట్టి, భక్తులు క్షమించాలని కోరారు. ‘‘ఐక్యతకు, శాంతికి, ఆధ్యాత్మికతకు చిహ్నంగా నిలిచిన ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసింది. కుంభమేళా (Maka Kumbh Mela) భారతదేశం ఐక్యతకు, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా నిలిచింది. అంచనాలను మించిన సంఖ్యలో భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి, పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఇది భారతదేశ నూతన శక్తిని, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. నవ భారత్‌ను నిర్మించే ఈ కొత్త శకం మొదలైందనడానికి ఇదే సాక్ష్యం’’ అని మోదీ (PM Modi) వివరించారు.
‘‘ఇంత గొప్పదైన ఈ కార్యక్రమాన్ని (Maka Kumbh Mela) వేరే వాటితో పోల్చడం కష్టం. త్రివేణి సంగమానికి కోట్లాది మంది ఎలా తరలివచ్చారు? అనే ప్రశ్న మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఈ భక్తులందరికీ అధికారిక ఆహ్వానాలు పంపలేదు. అయినా, వారు తమ హృదయాల్లోని ఆధ్యాత్మికను నింపుకొని ఇక్కడకు వచ్చారు. సంగమంలో స్నానం చేసిన తర్వాత వారి మొఖాల్లో కనిపించిన ఆనందం, శాంతి నేను ఎప్పటికీ మరచిపోలేను. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు, అందరూ తమ సౌకర్యాలను వదులుకుని, ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అద్భుతమైన అనుభవం’’ అని మోదీ (PM Modi) రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా, మహాకుంభమేళాను (Maka Kumbh Mela) విజయవంతంగా నిర్వహించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, ప్రయాగ్‌రాజ్ ప్రజలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరు భక్తులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం అంత సులువైన పని కాదని మనందరికీ తెలుసు. ఏర్పాట్లలో ఏవైనా లోపాలు ఉంటే, అవి అనివార్యమైనవి కాబట్టి.. గంగా, యమునా, సరస్వతి మాతలను ప్రార్థిస్తూ, భక్తులు క్షమించాలని కోరుతున్నాను. భగవంతుని స్వరూపాలుగా భావించే భక్తులకు సేవ చేయడంలో ఏదైనా లోపం ఉంటే, అందుకు ప్రజలు కూడా క్షమించాలని ఆశిస్తున్నాను’’ అని మోదీ (PM Modi) పేర్కొన్నారు.