Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కు ఊరట లభించింది. కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం (Muda Scam) కలకలకం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కు బదిలీ చేయాలని వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు (High Court ) కొట్టివేసింది. ఈ కేసును దర్యాప్తు సంస్థకు అప్పగించాలనే అభ్యర్థనను నిరాకరించింది. ముడా స్కామ్ కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందటం, అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దాఖలాలతో సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం (T.J. Abraham) గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రథమ నిందితుడిగా సిద్ధరామయ్యపై కేసు నమోదైంది.