హథ్రస్ తొక్కిసలాటలో కీలక పరిణామం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రస్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్సంగ్ నిర్వహించి వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన భోలే బాబా పై తాజాగా తొలి కేసు నమోదైంది. పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మెజ్రిస్టేట్ కోర్టులో కేసు నమోదైనట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. కాగా, ఈ నెల 2న హథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. అలీగఢ్‌తోపాటు హథ్రస్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో భోలే బాబా ఆధ్మాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ సత్సంగ్‌కు వేల సంఖ్యలో హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలో జూలై 2న నిర్వహించిన సత్సంగ్‌కు 80 వేల మందికి ఏర్పాట్లు చేయగా ఏకంగా రెండున్నర లక్షల మంది హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుని 121 మంది ప్రాణాలు కోల్పోయారు.