Kumbh Mela: కుంభమేళాకు హార్వర్డ్ ప్రొఫెసర్ల ప్రశంసలు

ప్రయోగ్‌రాజ్‌లో ముగిసిన మహా కుంభమేళా (Kumbh Mela)ను ఇటు సంప్రదాయం, సాకేతికత.. అటు వాణిజ్యం, ఆధ్యాత్మికతల మేలు కలయికగా ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయ (Harvard University) ప్రొఫెసర్లు అభివర్ణించారు. ఈ వేడుక నుంచి ఎన్నో పాఠాలు, అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు. న్యూయార్క్ (New York)లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడిక- మహాకుంభ్ అంతర్గత పాఠాలు పేరుతో ఇక్కడ ప్రత్యేక చర్చవేదికను నిర్వహించింది. పలువురు ప్రొఫెసర్లు (Professors )ఈ చర్యలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడిరచారు.