Gyanesh Kumar :నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?

నూతన సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. నూతన సీఈసీ గా జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar) ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi )తో పాటు, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్(Arjun Meghwal), ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సభ్యులుగా ఉన్నారు. జ్ఞానేశ్ కుమార్ కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.