Gyanesh Kumar: నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్

కేంద్ర ఎన్నికల ప్రధాన నూతన కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము (Draupadi Murmu ) ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడిరచింది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ నిలిచారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియనుండటంతో నూతన సీఈసీని ఎంపిక చేశారు. అంతకుముందు ఇదే అంశంపై సమావేశమైన ప్రధాని మోదీ (Modi )నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తదుపరి సీఈసీ పేరును ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లు ఈ భేటీలో పాల్గొన్నారు. 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా నియమితులైన జ్ఞానేశ్‌కుమార్ 2029 జనవరి 26 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు డాక్టర్ వివేక్ జోషి ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.