గ్రాన్యూల్స్ ఇండియా డైరెక్టరుగా సుచరితా రావు పాలెపు
గ్రాన్యూల్స్ ఇండియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెంటెండ్ డైరెక్టర్‌గా సుచరితా రావు పాలెపు నియమితులయ్యారు. ఐటీ, ఆర్థిక సేవల రంగాల్లో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ఆమె ఇటీవల వరకు టెక్ మహాంద్రాలో గ్లోబల్ హెచ్ఆర్ హెడ్‌గా పనిచేసినట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడిరచింది. ప్రస్తుతం ఆమె ఆర్గనైజేషన్, హెచ్ఆర్ విభాగాల్లో వ్యూహాత్మక సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. మానవ వనరులకు సంబంధించిన అంశాల్లో ఆమెకు ఉన్న అనుభవం తమకు ఉపకరిస్తుందని గ్రాన్యూల్స్ ఇండియా ఎండీ కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.






