Passport : రేపటి నుంచి అమల్లోకి … పాస్‌పోర్టు కొత్త రూల్స్

పాస్‌పోర్ట్ పొందేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 1980 నాటి పాస్‌పోర్ట్ (Passport) రూల్స్‌లో సవరణ చేసింది. పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకున్న సమయంలో జనన ధ్రువీకరణ పత్రాన్ని(Birth certificate) సమర్పించాలని కొత్త రూల్స్‌లో పేర్కొన్నారు. సవరించిన నిబంధనల ప్రకారం 2023, 1 కన్నా ముందు జన్మించిన వాళ్లు, బర్త్ సర్టిఫికేట్‌ను ఫ్రూఫ్‌గా ఇవ్వాలని పేర్కొన్నారు. మున్సిపాల్టీల్లో ఇచ్చే బర్త్ సర్టిఫికేట్లు లేదా, మెట్రికులేషన్, స్కూల్ సర్టిఫికేట్లు(School certificates) , లేదా ప్యాన్ కార్డ్, పీపీవో, ఎల్‌ఐసీ బీమా పాలసీ (LIC insurance policy ) పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇక 2023, అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రం రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ లేదా మున్పిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) లేదా ఇతర అధికారులు ఇచ్చే జనన ద్రువీకరణ పత్రాలు సరిపోతాయని ఆ నోటిఫికేషన్‌లో తెలిపారు.