Gautam Adani : గౌతమ్ అదానీ రూ.2,000 కోట్ల విరాళం

దేశంలో కనీసం 20 పాఠశాల (School)ల ఏర్పాటు కోసం రూ.2,000 కోట్లు విరాళం ఇవ్వనున్నట్లు అదానీ గ్రూపు (Adani Group) తెలిపింది. తన చిన్న కుమారుడు జీత్ (Jeet) వివాహం సందర్భంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10,000 కోట్ల విరాళాన్ని అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ (Gautam Adani) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో నుంచి ఆసుపత్రు(Hospitals ) ల నిర్మాణానికి రూ.6,000 కోట్లు, నైపున్యాభివృద్ధికి రూ.2,000 కోట్లను కేటాయించారు. తాజాగా రూ.2,000 కోట్లను పాఠశాలల కోసం సంస్థ ప్రకటించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా విద్యాలయాల ఏర్పాటుకు జీఈఎంఎస్ ఎడ్యుకేషన్ (GEMS Education )తో అదానీ గ్రూపునకు చెందిన దాతృత్వ సంస్థ అదానీ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.