Kumbh Mela: మహా కుంభమేళాలో మరోసారి అపశ్రుతి

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela )లో మరోసారి అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రయోగ్‌రాజ్ సెక్టార్-22లోని ఛట్‌నాగ్ ఘాట్ (Chattanooga Ghat)వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 15 గుడారాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది (Firefighters ) హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. 11 రోజుల క్రితం రెండు గ్యాస్ సిలిండర్లు (Gas cylinders) పేలడంతో భారీగా మంటు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 18 టెంట్లు దగ్ధమయ్యాయి.