Gautam Adani :అమెరికాలో అదానీకి ఊరట?

దాదాపు అర శతాబ్దం నాటి విదేశీ అవినీతి విధానాల చట్టం ( ఎఫ్‌సీపీఏ) అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆదేశాలు ఇచ్చారు. 60 రోజుల పాటు చట్టాన్ని సమీక్షించాలని, ఈలోగా దాని కింద కొత్తగా విచారణలేమీ చేపట్టరాదని ఆయన సూచించారు. వ్యాపార అవసరాల కోసం కంపెనీలు విదేశాల్లోని అధికారులకు లంచాలిచ్చి అవినీతికి పాల్పడకుండా నిరోధించేందుకు ఈ చట్టం లక్ష్యం. పారిశ్రామిక దిగ్గజ గౌతం అదానీ (Gautam Adani) పై లంచాల ఆరోపణలను ఇదే చట్టం కింద విచారణ చేస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయంతో ఆయనకు కొంత ఊరట లభించగలదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. భారత్ (India) లో సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు అధికారులకు లంచాలిచ్చారని, అమెరికా (America) లో నిధులను సమీకరించే క్రమంలో ఆ విషయాలను వెల్లడిరచలేదని అదానీ తదితరులపై గత ప్రభుత్వం అభియోగాలు నమోదు చేససిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సీపీఏ ప్రకారం అమెరికన్ కంపెనీ లైనా, ఇతర దేశాల కంపెనీలైనా వ్యాపార అవసరాల కోసం విదేశాల్లో అధికారులకు లంచాలివ్వడం చట్టవిరుద్ధం.